ప్రెసెంట్ వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ను ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీస్ లో  ''పుష్ప 2'' ఒకటి.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందోఅందరికి తెల్సు. అందుకని పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 వల్ల భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

పుష్ప ది రైజ్ 170 కోట్లతో తీయగా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 380 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.దీంతో నిర్మాతలు ఈమూవీ సీక్వెల్ మీద ఉన్న అంచనాలను చూసి ఈసారి దాదాపు 400 కోట్లతో తీస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ఐతే ఇ మధ్యనే  ఈ సినిమా పార్ట్ 2 షూట్ గ్రాండ్ గా వైజాగ్ లో స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశా రు.

ఇక పొతే రెండవ షెడ్యూల్ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ జరుగుతుంది. మరి షూట్ చేస్తున్న ఈ మూవీ నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది. ఐతే దాంట్లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది.అదే పుష్ప 2 క్లైమాక్స్ లో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తాడని. ఐతే ఇక్కడ ఉన్నా ట్విస్ట్ ఏంటంటే అది మూడో పార్ట్ కి లీడ్ అని టాక్.అంతేకాదు ఈ సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా పుష్ప 2 లో పరిచయం కానున్నాయి. ఐతే ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించ నున్నారట. ఏది ఏమైనా బన్నీ తన యాక్టింగ్ తో ఈసారి కూడా మెప్పించడం వంద శతం ఖాయం అని మేకర్స్ అంటున్నారు. దాని కోసమే  పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు దీనికి DSP మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: