చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొందరు ఈ నెపోటిజాన్ని సమర్థిస్తూ వుంటారు. అలాగే మరికొందరు నెపోకిడ్స్ గురించి తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు.ఇలా పరిశ్రమలో వారసత్వం కొనసాగడం కోసం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్న వారిని పూర్తిగా తొక్కేస్తూ ఉంటారని కొన్నిసార్లు వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా హింసించి చివరికి ఆత్మహత్య చేసుకునేలా అయితే ప్రేరేపిస్తారని కొందరు వాదిస్తూ వుంటారు.

కేవలం సినీ బ్యాగ్రౌండ్ ఉండి చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎవరు స్టార్ హీరోలు కారని వారి కి వున్న టాలెంట్ ద్వారా మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారని ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఇప్పటివరకు ఈ నెపోటిజంపై స్పందించి కామెంట్లు కూడా చేశారు.ఇలా వారసత్వం లేకుండా చిత్ర పరిశ్రమ లోకి వచ్చి సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందరో ఉన్నారని చెప్పవచ్చు అయితే తాజాగా నిజం స్మిత కార్యక్రమంలో భాగంగా నాచురల్ స్టార్ నాని ఈ నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు.రానాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాని నెపోటిజం గురించి మాట్లాడుతూ... సినిమా పరిశ్రమలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రేక్షకులేనని ఆయన తెలిపారు. ఉదాహరణకు నాకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఒక సినిమాలో నటించాను. నా సినిమాని కేవలం లక్షల సంఖ్యలో మాత్రమే వారు చూశారు.అదే రామ్ చరణ్ సినిమాని కొన్ని కోట్ల మంది అయితే చూశారు ఇక్కడ ఎవరు నెపోటీజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అంటూ ఈయన ప్రశ్న కూడా వేశారు..ఇక రానా కూడా మాట్లాడుతూ సినీ బ్యాగ్రౌండ్ ఉంటే చిత్ర పరిశ్రమలోకి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ స్టార్స్ గా సక్సెస్ కావాలి అంటే టాలెంట్ కూడా ఉండాలని ఇలా తమ టాలెంట్ తో మంచి స్థాయిలో ఉన్నప్పుడే వారు నిజమైన విజయాన్ని సాధిస్తారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: