మన తెలుగు ఇండస్ట్రీలో కష్టపడి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పై కి వచ్చి ఇపుడు టాప్ పొజిషన్ లో ఉన్నా స్టార్ మెగాస్టార్ చిరు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదుగుతున్న క్రమంలో వరుస విజయాలు సాధిస్తూ మిగతా హీరోలకి సవాల్ విసురుతున్న సమయం అది. ఆ టైంలో చిరంజీవి ఎఫెక్ట్ తో కొంతమంది హీరోలు వెనకంజ వేశారు.

దాంట్లో భాగంగానే ఆయన కంటే సీనియర్ విభాగంలో ముందు వరుసలో ఉన్నా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. చిరంజీవి హవా వల్ల కృష్ణకి అదే సమయంలో పరాజయాలు ఎదురవడం ఓకే అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సిన సమయంలో కృష్ణ చాలా డైలమాలో ఉన్నారు. అదే సమయంలో ఆయన రౌడీ అన్నయ్య అని ఒక సినిమాను ఒప్పుకున్నారు. ఆ సినిమా విజయవంతం కావాలంటే ఐటెం సాంగ్ ఉండి తీరాల్సిందే అని కృష్ణ పట్టు పట్టారు.

అంతేకాదు అప్పట్లో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్స్ అవుతున్నాయి. పైగా తమిళంతో పాటు మిగతా అన్ని భాషల్లో ఆమె హవా కొనసాగుతూ ఉండడంతో తన సినిమాలో కూడా సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ చేయాలని అనుకున్నారు. ఇలా ఒకానొక దశలో సిల్క్ స్మిత పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

ఐతే రౌడీ అన్నయ్య సినిమాలో బాబు మోహన్ ఒక కమెడియన్ వేషం వేశారు. అంతకు ముందుగా కొన్ని సినిమాల్లో బాబు మోహన్ ఐటమ్ పాటల్లో కనిపిస్తూ ఉండడంతో ఈ చిత్రంలో కూడా బాబు మోహన్ పైనే చిత్రీకరించాలని దర్శకుడు అనుకున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ లాంటి పెద్ద హీరో సిల్క్ స్మిత పక్కన ఐటెం సాంగ్ చేస్తే ఆయన అభిమానులు హార్ట్ అవుతారని కూడా దర్శకుడు భరద్వాజ్ ఆలోచించారు కానీ అందుకు కృష్ణ ఒప్పుకోలేదు. తానే సిల్క్ స్మిత పక్కన ఐటెం సాంగ్ చేస్తానని కృష్ణ మొండి పట్టు పట్టారు. అంతేకాదు దర్శకత్వ బాధ్యతల నుంచి భరద్వాజ్ నీ తప్పించి కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి ఆ పాట కోసం సెట్టింగ్ కూడా వేయించారు. వాకిట్లో రోకలి పెట్టా నటింట్లో తిరగలి పెట్టా అనే పల్లవి తో మొదలయ్యే ఈ పాట అప్పట్లో యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఈ విధంగా కృష్ణ, సిల్క్ స్మిత చేసిన ఐటమ్ సాంగ్ సినిమాకి యాడ్ కావడంతో మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఆ మూవీ కృష్ణ గారికి ఎన్నో ప్లాపుల తర్వాత విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: