
ఈ క్రమంలోని నెపోటిజంను ఉద్దేశిస్తూ హీరో నాని కూడా ఆసక్తికర కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది నాని మాట్లాడుతూ అసలు నేపోటిజంను పెంచి పోషిస్తుంది . ప్రేక్షకులు మాత్రమే.. నెపోటిజంను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది జనాలే... నాని మొదటి చిత్రాన్ని లక్షల్లో చూస్తే.. రామ్ చరణ్ మొదటి చిత్రాన్ని కోట్లల్లో చూశారు.. ఒకవేళ ఈ లెక్కను చూసుకుంటున్నట్లయితే నేపోటిజం ను ప్రోత్సహిస్తుంది ప్రేక్షకులే కదా అని అనడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరొకవైపు రామ్ చరణ్ పేరు మాత్రమే తీస్తూ నాని చేసిన వ్యాఖ్యలకు రామ్ చరణ్ అభిమానులు ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నెపోటిజం పేరుపైన రామ్ చరణ్ పేరు తీసి నాని వివాదాల్లోకి చిక్కుకున్నారు అని తెలుస్తోంది.
మరొకవైపు రానా కూడా ఈ కార్యక్రమానికి హాజరై తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది.. పిల్లలు దానిని మరో స్థాయికి తీసుకెళ్లినప్పుడే.. వాళ్ళు విజయం సాధించినట్లు అవుతుంది అంటూ రానా తెలిపారు.