టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాని. నాచురల్ స్టార్ నానికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నాని వేణు శ్రీరామ్ కాంబినేషన్ను సెట్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంసీఏ సినిమాకి సీక్వెల్ తరహా అంశంతో ఈ సినిమా రానందుని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాకు తమ్ముడు అని టైటిల్ను కూడా ఫిక్స్ చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం. 

అక్క తమ్ముడి కదా అంశంతో ఈ సినిమా రాబోతుందట. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్క పాత్రలో భూమిక నటిస్తోందని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలో వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ బయటికి రాలేదు. త్వరలోనే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అందరూ అంటున్నారు. సాధారణంగా నాని కొత్త డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు .ఈ నేపథ్యంలోనే వేణు శ్రీరామ్ కు నాని ఓకే చెప్తాడా లేదా అన్నది చూడాల్సిందే. అయితే తమ్ముడు అనే టైటిల్తో ఈ సినిమా వస్తే గనుక మెగా ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇక ఇప్పటికే నాని దసరా సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. దీంతో కచ్చితంగా ఏ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా అనంతరం నాని హిట్ 3 సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత నాని కెరియర్ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు అన్నది చూడాలి. ఈ క్రమంలోని బన్నీ ఛాన్స్ ఇవ్వని వేణు శ్రీరామ్ కు నాని ఛాన్స్ ఇస్తాడా లేదా అని ఎదురుచూస్తున్నారు నా మీ అభిమానులు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: