టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి డీసెంట్ హిట్ గా నిలిచినప్పటికీ.. ఆ సినిమా హిట్ మాత్రం అక్కినేని అభిమానులకు సరిపోలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్లయింది.దాంతో అఖిల్ ఎలాగైనా ఓ సాలిడ్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ అయ్యగారు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అఖిల్. 


ఏజెంట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన గ్లిమ్స్ ఇంకా పోస్టర్లు అయితే అభిమానులని ఇంకా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మళ్లీ మళ్లీ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఇంకా ఈ సాంగ్ కు ఆదిత్య అయ్యంగార్ సాహిత్యం అందించగా.. తమిళ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజ సంగీతం అందించి ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో మూవీ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాక్షి వైద్య అనే మోడల్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: