
అంతేకాదు అమెరికా ఫేమస్ టీవీ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కూడా ఈయన ప్రెజెన్స్ ఉండనుంది అని ముందు నుండి న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.
మరి తాజాగా రామ్ చరణ్ అమెరికాలో ప్రముఖ టీవీ షో గుడ్ మార్నింగ్ లో పాల్గొని సందడి చేసినట్టు సమాచారం.. ఈ షోలో అక్కడి స్థానిక తెలుగు మీడియా ఛానెల్స్ తో కూడా చరణ్ మాట్లాడగా వారు బాలయ్య అన్ స్టాపబుల్ షో గురించి కూడా ప్రశ్నించినట్టు సమాచారం.. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో ఫోన్ కన్వర్జేషన్ లో పాల్గొన్నారు కదా దాని గురించి మీకు ఎలా అనిపించింది అని కూడా ప్రశ్నించారట.
మరి ఈ ప్రశ్నకు చరణ్ సమాధానంగా.. నిజంగా అన్ స్టాపబుల్ షో నాకు ఎంతో నచ్చిందని.. బాలకృష్ణ గారి హోస్టింగ్ కూడా అదిరి పోయిందని.. తప్పకుండ తనకు కనుక ఆహ్వానం వస్తే మాత్రం ఆ షోకు వెళ్ళడానికి నేను రెడీ అంటూ చరణ్ కామెంట్స్ చేశారట.. మరి ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.. బాలయ్య షో ఎంత హిట్ అయ్యిందో అందరికి కూడా తెలిసిందే.. ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా మొదలు అయ్యింది.సీజన్ 2 లో మరింతగా సూపర్ స్టార్స్ తో బాలయ్య హోస్టింగ్ అదిరింది అనే చెప్పాలి.. మరి సీజన్ 2 లోనే ప్రభాస్ ఎపిసోడ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ వారితో ఫోన్ కాల్ కూడా మాట్లాడారు.. ఈయన ఫోన్ కన్వెర్జేషన్ ఫ్యాన్స్ కు స్పెషల్ కిక్ ఇచ్చింది అనే చెప్పవచ్చు... ఇక ఇప్పుడు ఇది గ్లోబల్ వైడ్ గా తెలియడంతో ఈ షోకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.