టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే ఈమె అల్లు అర్జున్ భార్య అయినప్పటికీ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తన ఫ్యామిలీ గురించి తన పిల్లల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని స్నేహ రెడ్డి తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఐతే ఆమె ఈ వీడియోను షేర్ చేస్తూ మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం అని అంది.మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే నర్సరీ నాకెంతో ఇష్టమైన ప్రదేశం అంటూ ఈమె తన ఇష్టాలను ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఇక ఈ ఫోటోలలో స్నేహ రెడ్డి ఎప్పటిలాగే చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై స్నేహ రెడ్డి లుక్ పై ఎప్పటిలాగే అభిమానులు స్పందిస్తూ మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇలా తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిరుచులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈమె షేర్ చేస్తుంటారు. ఇక అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

బన్నీ అభిమానులు పుష్ప లాగానే పుష్ప -2 అంతకంటే భారీ విజయం సాధించాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: