
ప్రభాస్ కెరీర్ లో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా రొమాన్స్ ఉంటుందని టాక్. ప్రభాస్ తో మాళవిక కూడా రొమాన్స్ కి రెడీ అని చెప్పడం తో ఇద్దరు అదరగొట్టేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రాజా డీలక్స్ షెడ్యూల్ కోసం మాళవిక హైదరాబాద్ చేరుకుంది. మారుతి ఈ సినిమా ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. తన మీద ప్రభాస్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు మారుతి. అందుకే సినిమా నుంచి ఎలాంటి లీకులు లేకుండా డైరెక్టర్ గా ఫస్ట్ లుక్ టీజర్ తో సర్ ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ప్రత్యేకంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమా లో ప్రభాస్ యాటిట్యూడ్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట. ప్రభాస్, మాళవిక మోహనన్ ఇద్దరి మధ్య సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తుండగా మారుతి సినిమా మాత్రం 2024 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ సొంత బ్యానర్ సినిమా కాబట్టి దీనికి అంత తొందర పడాల్సిన అవసరం ఏమి లేదని అంటున్నారు.