నిర్మాత దిల్ రాజు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. కోట్ల బడ్జెట్ పెట్టి భారీ సినిమాలను తీస్తాడు. స్టార్ సినిమాలతో పాటుగా కంటెంట్ ఓరియెంటెడ్ కథలకు ఆయన తీస్తుంటారు. అయితే తన బ్యానర్ కి అసలు సూపర్ క్రేజ్ తెచ్చింది అలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే. అది దిల్ రాజుకి కూడా బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు అలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం దిల్ రాజు అలాంటి మరో ప్రయత్నమే చేస్తున్నారు. అదే బలగం. కమెడియన్ వేణుకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తున్నాడు. సినిమా అంతా తెలంగాణా పల్లెటూరు నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కమెడియన్ గా ఓ పక్క కామెడీ స్టాక్ ఎక్సేంజ్ చేస్తున్న వేణు డైరెక్టర్ గా బలగం తీస్తుండటం విశేషం. దిల్ రాజు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బాగానే సద్వినియోగపరచుకున్నట్టు ఉన్నాడు వేణు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లే ప్రయ్త్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ సినిమాలైనా సరే భారీ ప్రమోషన్స్ ఉంటేనే తప్ప ఆడియన్స్ చూడట్లేదు. అందుకే బలగం సినిమాని రిలీజ్ ముందే జనాల నోట వినిపించేలా చేస్తున్నారు.

మార్చి 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. మరి దిల్ రాజు నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమా ప్రమోషన్స్ బాగా చేసి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో లాభాలు పొందుతున్నారు. సో థియేట్రికల్ రన్ లో వచ్చేదంతా లాభమే అని చెప్పొచ్చు. మరి బలంగ నిజంగానే బలం చూపిస్తుందా లేదా అన్నది చూడాలంటే మరో వారం వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: