సింగిల్ ఫార్ములా సినిమాలను తీసి అటు సూపర్ హిట్ లు సాధించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఇక తన సినిమాల్లో ప్రధానంగా కామెడీని తీసుకొని ఇక కుటుంబ నేపథ్యంతో చిన్న లైన్ రాసుకొని సినిమాలను తీసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక దర్శకుడిగా ఆయన కెరియర్ లో ఎన్నో విజయాలను సాధించారు అని చెప్పాలి. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్ లో మాత్రం ఒక చిన్న బ్యాట్ సెంటిమెంట్ ఉంది. వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎస్ వి కృష్ణారెడ్డి ఒకవేళ స్టార్ హీరోతో సినిమా చేశాడు అంటే చాలు అది ఫ్లాప్ కావడం ఖాయం అనిఒక బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతూ ఉంది.


 అదే ఎస్వి కృష్ణారెడ్డి ఒకవేళ చిన్న హీరోతో లేదా మిడ్ రేంజ్ హీరో తో సినిమా చేస్తే మాత్రం అది సూపర్ డూపర్ విజయం సాధిస్తుందని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు.  అయితే అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి ఇక ఇప్పుడు స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమైపోతున్నాడట. గతంలో బాలకృష్ణతో టాప్ హీరో, నాగార్జునతో వజ్రం  అనే సినిమాలను తీసి డిజాస్టర్ లను మూట కట్టుకున్నాడు ఈ డైరెక్టర్. అప్పటి నుంచి పెద్ద హీరోల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఒక చిన్న సినిమాతో బిజీగా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవితో సినిమా చేస్తానంటున్నాడు.


 దీంతో ఇక ఎస్వీ కృష్ణారెడ్డి పాత సెంటిమెంట్ గురించి తెలిసి మెగా అభిమానులు అందరూ కూడా ఉలిక్కిపడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ స్వయంగా ఎస్వీ కృష్ణారెడ్డి మెగాస్టార్ తోనే చెప్పారట. అయితే దీనికి చిరంజీవి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. తనను ముందు నుంచి చిరంజీవి ఎంతో ప్రోత్సాహించారని అందుకే ఆయనతో ఒక సినిమా చేయాలని ఆశపడుతున్నాను అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే ఇప్పటికే డిజాస్టర్ డైరెక్టర్లకు చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డికి కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం ఆ సినిమా ఏమవుతుందో అని అభిమానుల్లో భయం మొదలైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: