మేక పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సునీల్ ... అంజలి ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తి అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు కూడా లీక్ అవ్వగా అందులో రామ్ చరణ్ లుక్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన చాలా షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ మూవీ టైటిల్ ను ఇప్పటివరకు విడుదల చేయలేదు.

ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ జోష్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల తేదీ విషయంలో ఈ చిత్ర బృందం ఒక క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్స్ అన్న హాలు చేస్తున్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: