ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో అయితే రెగ్యులర్ కామెడీ దొరుకుతుంది. కానీ బుల్లితెర కార్యక్రమాల్లో ఎప్పుడు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు అని అటు సినీ ప్రేక్షకులు సైతం కార్యక్రమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. ఇలా గత దశాబ్ద కాలం నుంచి కూడా బుల్లితెరపై తెగ హాట్ టాపిక్ గా మారిపోయిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు చెబుతారు అది జబర్దస్త్ అని. అప్పటివరకు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాల్లో మాత్రమే దొరుకుతుంది అనుకున్న వారికి జబర్దస్త్ ఊహించని ఎంటర్టైన్మెంట్ను పంచింది.


 సరికొత్త కామెడీని పరిచయం చేసింది. దీంతో ఇక తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించింది.  ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కి కూడా లైఫ్ దొరికింది అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఇటీవలే కాలంలో జబర్దస్త్ లో కమెడియన్స్ హద్దులు దాటి పంచులు వేస్తూ ఉండడం మాత్రం ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. అడ్డు అదుపు లేకుండా లేడీ కమెడియన్స్ ని కూడా దారుణంగా పంచులతో ఏడిపించడం ఇక ఇటీవల కాలంలో వార్తల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవల ఇమ్మానుయేల్ జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష పై వేసిన ఒక పంచ్ కాస్త అందరికీ కోపం తెప్పిస్తుంది. ఏకంగా జబర్దస్త్ వర్షని పోర్న్ స్టార్ మియా కలీఫా తో పోల్చుతూ ఒక పంచు వేశాడు జబర్దస్త్ ఇమాన్యుల్. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ షూటింగ్ చేస్తున్నట్లుగా ఒక స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే దుబాయిలో పొడుగ్గా ఉంటుంది ఏంటది అని ఇమాన్యుయల్ ను అడుగుతాడు బుల్లెట్ భాస్కర్. బుర్జు ఖలీఫా అని చెప్పాక.. తర్వాత వర్షా వైపు చూపిస్తూ ఈమె మియా కలీఫా అంటూ పంచ్ వేస్తాడు. అదేంటి వర్షాను లవ్ చేస్తున్నాను అంటూ చెబుతూ చివరికి ఆమెను పోర్న్ స్టార్ తో పోల్చాడు అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: