సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ గ్లోబల్ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చి దాదాపు 2 ఏళ్ళు దాటింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రిలీజ్ అయిన తర్వాత 3,4 నెలలు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనులు మొదలుపెడదామని ఎస్ ఎస్ రాజమౌళి అనుకున్నాడు.కానీ రాజమౌళి మెయిన్ టార్గెట్ ఏంటంటే మహేష్ తో చేయబోయే సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను షేక్ చేయడం. అందుకోసం ఆర్.ఆర్.ఆర్ సినిమాని ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో ముందుకు తీసుకువెళ్లడం ఇంకా జపాన్ వంటి దేశాల్లో రిలీజ్ చేసే పని పెట్టుకున్నాడు. ఇంకా అలాగే ఆస్కార్ కు ఇండియా తరఫున ఈ సినిమా నామినేట్ అవుతుంది అనుకున్నాడు.కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అయితే నేం నార్మల్ కేటగిరిలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని ఆస్కార్ కి పంపించారు.


కానీ 'నాటు నాటు' అనే పాట మాత్రమే ఈ నామినేషన్స్ లో స్థానం దక్కించుకుంది. ఇంకా ఈ పాటకు ఎలాగైనా ఆస్కార్ రావాలని రాజమౌళితో పాటు ఇండియా మొత్తం కూడా ఎంతగానో కోరుకుంటుంది. మరి మన 'నాటు నాటు' కి ఆస్కార్ దక్కేది లేనిది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. 'ఆస్కార్ అవార్డుల ప్రకటన వచ్చిన తర్వాత రాజమౌళి మహేష్ సినిమా పై ఫుల్ గా దృష్టి పెడతాడని సమాచారం తెలుస్తుంది. మహేష్ కోసం ఒకటి కాదు ఏకంగా 3 కథలు రెడీ చేశాడు రాజమౌళి.అవి మహేష్ కు కూడా చాలా బాగా నచ్చాయి. మహేష్ తో చేయబోయేది గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీ అని రాజమౌళి అనౌన్స్ చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి రచయితగా పనిచేస్తారు. రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో 'శ్రీ దుర్గా ఆర్ట్స్' బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ ఈ సినిమాని గ్లోబల్ లెవెల్ లో నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: