సినిమా షూటింగ్ అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. షూటింగ్ స్పాట్‌కి చెప్పిన టైమ్‌కి నటీనటులు వెళ్తుంటారు. అనుకున్న సమయానికి కొన్ని సీన్లు చిత్రీకరిస్తుంటారు. ఒక్కోసారి తిండి, నిద్ర కరువై ఇబ్బంది పడుతుంటారు. అందుకే నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే నటీనటులు కాస్త ఆటవిడుపు కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తుంటారు. లేదా కుటుంబంతో ఇంట్లోనే సమయం గడుపుతుంటారు. ఇక షూటింగ్ స్పాట్‌లో కూడా కాసేపు సమయం దొరికితే రకరకాల గేమ్స్ ఆడుతుంటారు. నటీనటుల మధ్య కొన్ని సందర్భాలలో గొడవలు జరగడం సహజం. తాజాగా నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా 'దసరా' సినిమా తెరకెక్కుతోంది. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం కొన్ని షెడ్యూల్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో నాని-కీర్తి సురేష్ బ్యాడ్మింటన్ ఆడారు. అయితే ఆట మధ్యలో ఏదో గొడవ జరిగింది. దీంతో నానిని కొట్టేందుకు కీర్తి సురేష్ బ్యాట్ పట్టుకుని చాలా కోపంగా మీదికి వచ్చింది. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఏమీ అనలేక నాని ఆమె మాటలకు సరేనని తలూపాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 24న నాని బర్త్ డే. అతడిని విష్ చేస్తూ కీర్తి సురేష్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య స్నేహం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని వీరు పలు సందర్భాల్లో చెప్పారు. ఇక ఈ దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: