తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందినటు వంటి హ్యాపీ డేస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో వరుణ్ సందేశ్ కు మంచి గుర్తింపు లభించింది. హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన కొత్త బంగారు లోకం మూవీ లో హీరోగా నటించి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా వరుణ్ సందేశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ వరుణ్ సందేశ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా వరుణ్ సందేశ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి గా నిలిచిన కొత్త బంగారు లోకం మూవీ కథను మొదట వరుణ్ సందేశ్ కోసం కాకుండా మరో హీరో కోసం తయారు చేశారట. ఆ హీరో ఎవరు ... ఆ కథ ఏమిటి అనేది తెలుసుకుందాం.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య కోసం కొత్త బంగారు లోకం మూవీ కథను తయారు చేశారట ... అలాగే ఈ మూవీ కథను కూడా నాగ చైతన్య కు ఈ మూవీ బృందం వినిపించారట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నాగ చైతన్య ఈ సినిమాలో నటించలేక పోవడం వల్ల ఇదే కథను వరుణ్ సందేశ్ కు వినిపించడం వరుణ్ సందేశ్ కు ఈ కథ బాగా నచ్చడంతో వరుణ్ సందేశ్ తో ఈ మూవీ ని తెరకెక్కించారు. అలా నాగ చైతన్య కోసం తయారు చేసిన కథతో వరుణ్ సందేశ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికి కూడా వరుణ్ సందేశ్ కెరియర్ లో ఈ మూవీ ఎవర్ గ్రీన్ మూవీ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: