టాలీవుడ్ స్టార్ హీరో ఐనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా యొక్క రిలీజ్ డేట్ విషయం లో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ ను కచ్చితం గా సమ్మర్ లో రిలీజ్  చేసే ఛాన్సెస్ ఉన్నాయని భావించారు, కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

దానికి కారణం ఈ సినిమా రెండు పార్ట్ లుగా రావడమే అంటూ కొంతమంది వారివారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే మనకు విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు యొక్క కథను రెండు పార్ట్స్ గా విభజించడం వల్లే మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని అలాగే మొదటి భాగం విడుదల తేదీ మరింత ఆలస్యం అవుతుందని సమాచారం అందుతుంది. ఐతే ఈ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని డైరెక్టర్ క్రిష్ ఇటీవల ఒక ముఖాముఖీ సంభాషణలో చెప్పాడు.

పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ ఉంది. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆయన ఈ మధ్యనే వినోదయ సీతమ్ యొక్క రీమేక్ షూటింగ్ లో పాల్గొన్నారు. వచ్చే నెలలో హరీష్ శంకర్ డైరెక్షన్లో లో సినిమా ను కూడా చేయబోతున్నాడు. ఆ విధంగా బిజీ బిజీ గా పవన్ కళ్యాణ్ సినిమాలతో దూసుకు పోతున్న తరుణంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐతే హరి హర వీరమల్లు సినిమా ఫస్ట్ పార్ట్ ఐనా ఈ సంవత్సరం లో వస్తుందా లేదా అనేది క్లారిటీ ఇంకా లేదు. ఒక విషయం అయితే పక్కాగా తెలుస్తోంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ నుండి ఈ సంవత్సరం లో ఒకటి లేదా రెండు సినిమా లు రిలీజ్ అవుతాయని మాత్రం చెప్పవచ్చు.రాబోయే సంవత్సర కాలం లో బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా లు వస్తాయని క్లారిటీగా ఉంది.

కాకపోతే ఆయన అటు పాలిటిక్స్ లో కూడా బిజీ ఐపోతున్నారు కాబట్టి కొద్దిగా సినిమాల రిలీజ్ డేట్స్ మారొచ్చు అని ఆయన అభిమానులు అంటున్నారు.పవన్కళ్యాణ్ గారికి ఒకవైపు ప్రజల క్షేమం ఇంకోవైపు అభిమానులను ఆనందపరచడం దేంట్లో కూడా ఆయన ఎవరిని అన్యాయం చేయరనేది ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: