బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నటీనటులు  కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి నెలలో రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా బంధుమిత్రులు, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఐతే ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు.

ఐతే వారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా లేటెస్టుగా ఓ అవార్డు వేడుకలో భాగంగా ఈ కొత్త జంట తలుక్కుమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లవ్ మ్యారేజ్ గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఉండడం ఎంతో బాగుంటుందో ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్తే ఆ సంతోషమే వేరు అంటూ ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇక తను తన పెళ్లి వేడుకలలో చాలా భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా కియారా వెల్లడించారు. పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత పెళ్లి పీటలపై సిద్దార్థ్ మల్హోత్రాను చూడగానే మనసంతా ఏదో పులకించిందని, ఆ ఫీలింగ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉంటుందని ఈ సందర్భంగా లవ్ మ్యారేజ్ గురించి ఈ కొత్త పెళ్లికూతురు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐతే పెళ్లి తర్వాత ఈ జంట వారి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఐతే ప్రస్తుతం కియార అద్వానీ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఆమె చేసిన కామెంట్స్ ప్రేమ జంటకు ఒక బూస్ట్ లాగా అనిపిస్తున్నాయని నేటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: