బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్షయ్ కుమార్ కి హిందీలో మంచి మార్కెట్ ఉంది. మినిమం గ్యారంటీ హీరోగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మంచి పేరు తెచ్చుకున్నాడు.కానీ ఆయన ఈమధ్య కాలంలో ఆయన సినిమాలు వరుసగా విడుదల అవుతూ చాలా దారుణంగా డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. అక్షయ్ కుమార్ మార్కెట్ హిందీలో దారుణంగా పడిపోయిందా అనే అనుమానాలు కూడా కలిగేలా చేస్తున్నాయి ఆయన సినిమాలు. ఆయన నటించిన సినిమాల విషయానికి వెళ్తే బచ్చన్ పాండే సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన జిగర్తండ అనే సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కింది.తెలుగులో దీన్ని గద్దల కొండ గణేష్ గా తెరకెక్కిస్తే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో బచ్చన్ పాండేగా తీస్తే ఆ సినిమా చాలా దారుణమైన ఫ్లాప్ అయింది.


ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన సామ్రాట్ పృథ్వీరాజ్  ఇంకా అలాగే రక్షాబంధన్ సినిమాలు కూడా బాలీవుడ్ కి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. బాలీవుడ్ మీద బ్యాన్ విధించాలంటూ అప్పట్లో జరిగిన ప్రచారాలు కూడా ఈయన సినిమాలకు చాలా పెద్ద దెబ్బ వేసే విధంగా మారాయని ప్రచారం కూడా ఉంది.అయితే ఆ తర్వాత ఆయన చేసిన క్యూట్ ఫుట్లీ సినిమా కూడా చాలా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన రటసన్ అనే సినిమాని తెలుగులో రాక్షసుడు పేరుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తే ఆ సినిమా తెలుగులో పెద్ద సూపర్ హిట్గా నిలిచింది. కానీ అదే సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేస్తే మాత్రం చాలా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఈమధ్య మలయాళం లో సూపర్ హిట్గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని హిందీలో సెల్ఫీ పేరుతో రీమేక్ చేశారు. అంతేకాదు విడుదలకు ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. అయినా కూడా ఆ సినిమా చాలా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: