విజయ్ దేవరకొండ సమంత ల కాంబినేషన్ లో ప్రారంభం అయిన ‘ఖుషీ’ సమంత కు అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉండి ఉంటే ఈపాటికే రిలీజ్ అయి ఉండేది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక ప్రేమ కథగా తీర్చి దిద్దుతున్నారు. వాస్తవానికి సమంత తన అనారోగ్య సమస్యల నుండి తెరుకోగానే ఈమూవీ షూటింగ్ తిరిగి ప్రారంభిద్దామని ఈమూవీ దర్శక నిర్మాతలు అనుకున్నారు.

 

 
అయితే సమంత తన అనారోగ్యం నుండి తేరుకున్న వెంటనే తన డేట్స్ ‘ఖుషీ’ కి కాకుండా బాలీవుడ్ లో ఆమె నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కు ఇవ్వడంతో ‘ఖుషీ’ ఆలోచనలు ముందుకు సాగలేదు. దీనిపై విజయ్ దేవరకొండ అభిమానులకు కూడ విపరీతమైన కోపం రావడంతో సమంత ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెట్టడంతో ఎలర్ట్ అయిన సమంత తన డేట్స్ ను ‘ఖుషీ’ నిర్మాతలకు మార్చి ఒకటి నుండి ఇచ్చినట్లు లీకులు వస్తున్నాయి.

 

 
దీనితో ‘ఖుషీ’ షూటింగ్ వేగంగా పరుగులు తీసి కనీసం ఈమూవీ ఆగష్టు 15 ప్రాంతంలో విడుదల అవుతుందని చాలామంది భావించారు. అయితే సమంత తన డేట్స్ ను ‘ఖుషీ’ నిర్మాతలకు ఇచ్చినప్పటికీ వారంతా హ్యాపీగా లేరని తెలుస్తోంది. దీనికి కారణం హిమాలయాలలోని మంచుకొండలు అని అంటున్నారు. మార్చి నెల ప్రాంతం నుండి జూన్ నెల వరకు వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా హిమాలయ పర్వతాలు నెమ్మదిగా ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా కరుగుతూ ఉంటాయి.

 
ఈవిషయం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ దృష్టి వరకు వెళ్ళడంతో ఈమూవీ షూటింగ్ ను హిమాలయాల ప్రాంతాలలో కాకుండా నార్వే దేశంలోని దట్టమైన మంచుకొండల మధ్య సమంత విజయ్ దేవరకొండల పై రెండు పాటలు చిత్రీకరిస్తారట. అంతేకాదు ఈమూవీని నార్వే దేశంలో తీసినప్పటికీ ఆ పాటలను కాశ్మీర్ లో చిత్రీకరించినట్లు ఈమూవీని చూసే సగటు ప్రేక్షకులకు భావం కలుగుతుందట..


మరింత సమాచారం తెలుసుకోండి: