కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో నేరుగా చేసిన చిత్రం సార్... ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకకాలంలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది.. "జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్" కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  సమాజంలో విద్యావ్యవస్థ పై జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది ఈ సినిమా.. ఇప్పటికే చాలామంది పెద్దలు విద్య పేరిట సామాన్య ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని.. వారిని మరింతగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇదే కాన్సెప్టును వెంకీ అట్లూరి తెరపై చాలా అద్భుతంగా చూపించారు.

ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంది. అంతేకాదు 500 మంది విద్యార్థులకు ఈసారి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు థియేటర్ నిర్వాహకులు. ఇకపోతే ఇప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయామని బాధపడే అభిమానులకు ఒక శుభవార్త తీసుకొచ్చింది చిత్ర బృందం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఉగాది పండుగ సందర్భంగా జనవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలిసి ఇటు ఓటీటీ ప్రేక్షకులు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులు ఆచరణలోకి తీసుకొచ్చిన కొన్ని పద్ధతుల కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.  ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చర్ చేసిన పోరాటమే సార్. ఈ సినిమా బాగుంది అనే టాక్ రావడంతో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ..ఇటు యువత.. అటు చిన్న పిల్లల సైతం ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: