కథ రచయిత అంటే చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో అందరికి చిన్న చూపు అయితే ఉంది అందుకే పరిశ్రమ లో వర్క్ చేస్తున్న ఏ రచయిత కూడా హ్యాపీ గా అయితే ఉండడు.అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కొరటాల శివ ఆయన రైటర్ గా ఉన్నప్పుడు ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.

కొరటాల శివ కూడా ఆయన కెరియర్ స్టార్టింగ్ లో రచయిత గా చేసారు అప్పుడు ఆయన ఒక డైరెక్టర్ దగ్గర చాలా ఇబ్బందులను కూడా ఎదురుకున్నారట,ఒక సినిమాకి ఆయన కథ మాటలు మొత్తం ఇస్తే ఆ డైరెక్టర్ కథ కి నా పేరు వేయించుకుంటా డైలాగ్స్ కి నీపేరు వేయిస్తా అని చెప్పాడట .ఇక చేసేది ఏం లేక ఆయన ఒప్పుకున్నాడట.

ఆయనతో చేసిన ఇంకో సినిమాకి కూడా ముందు సినిమాలాగే కథ నాది మాటలు నివి అని టైటిల్ కూడా వేయిస్తా అన్నాడని చెప్పుకొచ్చాడు.దానికి విపరీతమైన కోపం వచ్చిన కొరటాల వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోలేదట. నేను రాసుకున్న కథ కి నీ పేరు ఎలా వేయించుకుంటావ్ అని గొడవ కూడా పెట్టుకున్నాడట ఆ గొడవ జరిగిన తర్వాత కొరటాల గారు అక్కడి నుంచి కోపం గా స్టోరీ డైలాగ్స్ రెండింటిలో నాపేరు వేస్తె వేయండి లేకపోతే మొత్తానికే తీసేయండి అని కూడా చెప్పి బయటికి వచ్చారట.

సినిమా డైరెక్టర్ కథ మాటలు దేంట్లో కూడా కొరటాల పేరు వేయకుండా ఆయన ఒక్కడి పేరు మాత్రమే వేయించుకున్నాడని తెలుస్తుంది.ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరనేది ఆయన బయట పెట్టలేదు.,ఆయన గురించి అడిగితే వాడి గురించి చెప్పడం అవసరం లేదు అని తన పాపాన తానే పోతాడు అని చెప్పాడు. అలాగే  అతని మీద కోపం తోనే నేను డైరెక్టర్ ని అయ్యాను అని కూడా కొరటాల చెప్పారు.అలా కొరటాల డైరెక్టర్ అయి మంచి సినిమాలను తీసి ఇండస్ట్రీ లో ఒక స్టార్ డైరెక్టర్ గా అయితే గుర్తింపు పొందాడు కొరటాల ప్రస్తుతం ఎన్టీయార్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: