నవీన్ పొలిశెట్టి యువ హీరోల్లో మంచి దూకుడు మీద ఉన్న హీరో. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు రెండు సినిమాలతో తన టాలెంట్ ఏంటో చూపించిన నవీన్ పొలిశెట్టి రాబోతున్న రెండు క్రేజీ సినిమాలతో సత్తా చాటలని చూస్తున్నాడు. అందులో ఒకటి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కాగా మరొకటి అనగనగా ఒకరాజు. ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడు ఉండటం నవీన్ సినిమాకు సూపర్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు కొద్దిపాటి గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన నవీన్ ఏజెంట్ ఆత్రేయ సినిమాతో హీరోగా తన టాలెంట్ ఏంటో చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా అయితే అతన్ని ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. ఈ రెండు సినిమాలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ అనుష్కతో జత కట్టే రేంజ్ కి వెళ్లాడు. అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కూడా నవీన్ మార్క్ కామెడీతో అదరగొడుతుందని తెలుస్తుంది. నవీన్ హ్యూమర్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే ఆ కామెడీ సెన్స్ తోనే తన సినిమాలు చేస్తున్నాడు. ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ ఇస్తూ సినిమాలతో అలరిస్తున్నాడు నవీన్. జాతిరత్నాలు తర్వాత వెంటనే సినిమాలు ఓకే చేయకుండా ఆ సినిమాను మర్చిపోయి మళ్లీ తనని కొత్త పాత్రలో ఎంకరేజ్ చేసేలా ప్లాన్ చేశాడు నవీన్. రాబోతున్న రెండు సినిమాలు రెండు డిఫరెంట్ స్టోరీస్ కావడంతో ఈ రెండు సినిమాలతో కూడా అతను హిట్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: