సాధారణంగా చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం కొన్ని సినిమాలే చేసినా అవి సినీ పరిశ్రమ ఉన్నంతకాలం పాటు గుర్తిండి పోయేలా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది.. అలాంటి వారిలో కృష్ణవంశీ ఒకరు.. ఆయన చేసిన సినిమాలు చాలా కొత్తగా.. ఫ్యామిలీ అంతా సంబరాలతో నిండిపోయి స్క్రీన్ మీద ఒక పండగలా అనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఫ్యామిలీ మూవీస్ అంటే ఫ్యామిలీ మొత్తం అన్ స్క్రీన్ మీద చూపించి.. అది మన ఫ్యామిలీ నా అనే విధంగా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.  ఇకపోతే కృష్ణవంశీ చాలా సినిమాలు తీశారు.  అందులో నాగార్జున, టబు జంటగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫ్యామిలీ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించింది.

అయితే ఈ సినిమా షూటింగ్ గురించి చాలామంది ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా ఈ సినిమా షూట్ చేసేటప్పుడు కృష్ణవంశీ అసలు స్క్రిప్ట్ అనేదే రాసుకోలేదట . డైరెక్ట్ గా లొకేషన్లోనే ఎవరు ఏం చెప్పాలి అనేది తను చెప్పేసి సినిమా తీయడం జరిగిందని అప్పట్లో ఈ వార్త చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా మొత్తం అలాగే తీసారంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో కృష్ణవంశీ స్పందిస్తూ స్క్రిప్ట్ పేపర్స్ లేకుండా అసలు సినిమా ఎవరైనా ఎలా తీస్తారు నేను కూడా స్క్రిప్ట్ రాసుకున్నాను ఆ పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: