తమిళ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో తెలుగులో మొదటిసారి ప్రయోగం చేశాడు. అంతేకాదు తెలుగులో ఫస్ట్ మూవీతోనే ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాడు ధనుష్.ఈ సినిమాలో ధనుష్ కాలేజీ లెక్చరర్ గా కనిపించి తన నటనతో దుమ్ముదులిపాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా సంయుక్త మీనన్  నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఓ రేంజిలో దుమ్ము దులుపుతుంది.ఇక తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడడంతో.. ఓపెనింగ్స్ కూడా సూపర్ రేంజ్ లో చూసింది. దీంతో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది.


ఇక మొదటి వారం పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు నమోదు చేసింది. తాజాగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు రాబడుతుంది. ధనుష్ కెరీర్ లోనే కర్ణాటకలో హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటుంది. యూకే లో 200K డాలర్లు ఇంకా అలాగే యూఎస్‌ఏ లో 400K డాలర్లు ఈ సినిమా అందుకుంది. తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ లోనే ఈ సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుంది.ఈ కలెక్షన్స్ ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని చేరుకున్నాయి.ఇక ఈ సినిమా విద్య వ్యవస్థను ప్రశ్నించేలా చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రైవేట్ రంగంలో చదువు వ్యాపారంగా మారుతుంది అనే మెసేజ్ ని మంచి కమర్షియల్ హంగులతో చాలా చక్కగా అద్భుతంగా చూపించాడు ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: