నందమూరి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందినటు వంటి బింబిసారా అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా పోయిన సంవత్సరం బింబిసారా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం తాజాగా అమిగొస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డ కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ భారీ లోకి దిగింది.  

అలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 6.55 కోట్ల షేర్ ... 11.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు టోటల్ రన్ ముగిసే సరికి 5.45 కోట్ల నష్టాలు దక్కాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: