ఈ ఆఫర్ ని అల్లు అర్జున్ ముందు ఉంచితే అతను మాత్రం సైలెంట్ గా కాదనేశాడని టాక్. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 1 తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఇరగ ఆడేసింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ హిందీ ఆడియన్స్ కి పూర్తిగా ఎక్కేసింది. అందుకే సినిమాను ఆ రేంజ్ హిట్ చేశారు. అలాంటి పుష్ప రాజ్ పాత్రతో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ని జవాన్ లో నటింపచేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. అయితే షారుఖ్ సినిమాని లేపడానికి మరో హీరో అది కూడా అల్లు అర్జున్ అవసరం లేదు.
అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమా ఒప్పుకోకపోవడానికి కూడా కొన్ని రీజన్లు ఉన్నాయట. పుష్ప సినిమాతో తనకు వచ్చిన ఈ క్రేజ్ ని అప్పుడే చిన్న చిన్న పాత్రలు వేసి పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు బన్నీ. అందుకే జవాన్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. బన్నీ ఆలోచన ఏదైనా పుష్ప 2 తో మరోసారి బాలీవుడ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు పుష్ప రాజ్. సుకుమార్ కూడా నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇదంతా సినిమా రిజల్ట్ పై ఏమేరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.