సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం ఈమె వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రష్మిక మందన, పూజ హెగ్డే ఇలాంటి స్టార్ హీరోయిన్ లో కూడా పిక్స్ టైంలో అర డజన్ కి పైగానే సినిమాల్లో నటించేవారు. కానీ శ్రీ లీలా మాత్రం వాటన్నిటిని దాటేసి దాదాపు పది సినిమాలకు పైగానే చేస్తుంది.ప్రస్తుతం ఈమె మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అంతేకాదు బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. 

ఈ సినిమాలతో పాటు నితిన్ ,పంజా వైష్ణవి తేజ్ ,రామ్ మరియు బోయపాటి, నవీన్ పోలిశెట్టి ,అనగనగా ఒక రోజు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది శ్రీ లీల. ఈ సినిమాలే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న వస్తా భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది .ఈ క్రమంలోనే సీనియర్ హీరోలతో నటిస్తున్న క్రమంలో తన పై రకరకాల రూల్స్ చేస్తున్నారు .ఇందుకుగాను  అప్పట్లో శ్రీదేవి తనకంటి 40 ఏళ్లు పెద్దవారైనా ఎన్టీఆర్ ఏఎన్నార్లతో కలిసి నటించింది అంటూ ఈమెని  వెనకేసుకొస్తున్నారు. దీంతో ఈమె క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.

ఇలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా రెండు సినిమాలలో నటిస్తోందని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేస్తున్నారు. ఇక రెండు సినిమాల్లో కూడా దాదాపుగా శ్రీల హీరోయిన్గా ఫిక్స్ అయింది అని తెలుస్తుంది .అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే 2023 కాకుండా 2024 లో కూడా శ్రీ లీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు శ్రీ లీలా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దాదాపు సగం కన్నా ఎక్కువ సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: