సోషల్ మీడియా వేదికగా చాలామంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విషయాలను అలాగే పలు బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సమంత తెలుగు, తమిళ్ భాషలలోనే కాదు ఇప్పుడు హిందీలో కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుణ్ దావన్ తోకలిసి సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవల మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి కారణంగా కొంతకాలం పాటు తాను కమిటైన సినిమా షూటింగ్లకు ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్య నుంచి కోలుకోవడంతో తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్లలో బిజీ అవుతున్నారు సమంత. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.  ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ వాటిని ఇంస్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తోంది. కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే 24.8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు సమంత. ప్రత్యేకంగా టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేస్తుంది.

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ నెలకు ఏకంగా రూ.3 కోట్లు ఆదాయాన్ని అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ కోసం దాదాపు రూ.20 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుందని తెలుస్తోంది ప్రస్తుతం సినిమాలలో కూడా రూ. 2 - 4 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న నేపథ్యంలో ఇలా ఒకవైపు సినిమాలు మరో ఒకవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా భారీగానే సంపాదిస్తోంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: