టాలీవుడ్ హీరో మెగా కుమారుడు రామ్ చరణ్ ఈమధ్య ఏదో ఒక విషయంలో తరచూ వార్తలలో వినిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా rrr సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అలాగే ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో కూడా ఈ విషయంలో కూడా మెగా అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. ఇక తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుత రామ్ చరణ్ చేయబోయే సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మరి నటిస్తున్నట్లు తెలుస్తోంది.


RC -15 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లిన ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కేవలం లీకులు మాత్రం అయ్యాయి దీంతో అభిమానులు ఈ విషయంలో కాస్త నిరుత్సాహం కు లోన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే అభిమానులను ఖుషి చేయడానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC -15 సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు హీరోలతో పనిచేయని డైరెక్టర్ శంకర్ మొదటిసారి రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమాని చేయబోతున్నారు.


ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పుడు రివిల్ చేయబోయే సినిమా టైటిల్ గురించి అటు అభిమానులలో ఇటు ఇండస్ట్రీలో బాగా హైప్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు శంకర్ సినిమా టైటిల్ భాషను బట్టి మారుతూ వచ్చాయి. తెలుగులో రోబో గా, తమిళంలో ఏందిరన్, తెలుగులో అపరిచితుడు, తమిళ్లో ఆనియన్ గా విడుదలయ్యాయి ఇప్పుడు RC -15 లో కూడ ఇదే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం కూడా క్లారిటీ ఇవ్వాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే ఇందులో హీరోయిన్  కియారా అద్వాని నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: