ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎక్కువగా మారి మోగిపోతున్న హీరోయిన్ పేరు శ్రీ లీల. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మా. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో కుర్ర కారును పగటి కలల్లోకి నెట్టేసింది అని చెప్పాలి. సాంప్రదాయ వస్త్రధారణలో అయినా లేదంటే మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా ఇక శ్రీలీల కంటే అందంగా ఇంకెవరూ ఉండరేమో అని అనేంతలా ఈ అమ్మడు అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి. అంతేకాదు ఇక తనలో దాగి ఉన్న డాన్స్ నటన టాలెంట్ తో కూడా అందరిని ఫిదా చేసేసింది.


 ఇకపోతే ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఇక కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీ లీల ఇక నాలుగు కోట్లు డిమాండ్ చేసిన కూడా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే గత ఏడాది రవితేజతో జోడి కట్టి ధమాకా అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఈ అమ్మడు ఛాన్సులు దక్కించుకుంటుంది అని చెప్పాలి. అయితే శ్రీ లీలా టాలీవుడ్ లో ఇంతలా బిజీగా మారిపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అయ్యాడు అన్నది మాత్రం ఒక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు. డైరెక్ట్ గా కాదు కానీ పరోక్షంగా శ్రీ లీల కెరియర్ ఊపందుకోవడానికి కారణం అయ్యాడట. ప్రస్తుతం మహేష్ బాబు కు జోడిగా శ్రీ లీలకు ఛాన్స్ వచ్చింది. దీంతో ఇక ఇతర స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో శ్రీ లీలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారట. మహేష్ బాబు హీరోయిన్గా శ్రీ లీల మారిపోవడంతో మిడ్ రేంజ్ హీరోలు సైతం శ్రీ లీల వైపే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ  కథ నచ్చితేనే సినిమాలకు ఓకే చెబుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: