టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రద్ధా దాస్  పుట్టిన రోజు ఈరోజు. ఈ ఏడాదితో 35వ ఏట అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకుందాం..ముంబైకి చెందిన బెంగాలీ ఫ్యామిలీలో శ్రద్ధా దాస్ జన్మించారు. 1987 మార్చి 4 వ తేదీన వ్యాపారవేత్త సునీల్ దాస్ - స్వప్న దాస్ దంపతులకు పుట్టిందీ ఈ అందాల ముద్దుగుమ్మ. నేడు ఆమె పుట్టిన రోజు. ఈరోజుతో శ్రద్ధాదాస్ 35 ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు ఇంకా శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.15 ఏళ్లుగా ఇండస్ట్రీలో శ్రద్దా దాస్ కొనసాగుతుంది. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టకముందు పలు అడ్వర్టైస్ మెంట్స్ లలో కనిపించింది. అంతకుముందు ముంబైలోనే తన డిగ్రీని కంప్లీట్ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా జర్నలిజం పట్టాను శ్రద్ధా పొందారు.ఇక ఆ తర్వాత థియేటర్ ఆరిస్ట్ గా పలు స్టేజీ పెర్పామెన్స్ లు కూడా శ్రద్దా ఇచ్చారు. ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్టులు పీయూష్ మిశ్రా లాంటి వారు నిర్వహించిన వర్క్ షాప్స్ లలో కూడా ఆమె హాజరైంది.


అక్కడ నటనా నైపుణ్యాన్ని పొందిన శ్రద్ధా దాస్ గ్లాడ్ ర్యాగ్స్ 400 క్యాటల్యాగ్స్ కు సంబంధించిన ప్రింట్ అడ్వర్టైజ్ మెంట్స్ లో కూడా కనిపిచింది.శ్రద్ధా  తన కెరీర్ ను టాలీవుడ్ ఎంట్రీతోనే ప్రారంభించింది. 'సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానే చాలా సినిమాల్లో కూడా ఆమె మెరిసింది.టార్గెట్, 18,20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత్రి, ముగ్గురు ఇంకా మొగుడు వంటి సినిమాలతో హీరోయిన్ గా అలరించే ప్రయత్నం చేసింది. కానీ వాటితో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రద్ధా నటించిన సెకండ్ లీడ్ రోల్స్ మాత్రం ఆమెకు యూత్ లో చాలా మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. 'ఆర్య -2', 'డార్లింగ్', 'నాగవల్లి','గుంటూరు టాకీస్','డిక్టేటర్' వంటి సినిమాల్లో శ్రద్ధా నటనకు మంచి మార్కులు పడ్డాయి.ప్రస్తుతం  'ఢీ15' డాన్స్ షోతో బుల్లితెరపైనా అలరిస్తున్నారు. ఈ షో ద్వారా ఆమె మరింత క్రేజ్ దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: