రియల్ స్టార్ ఉపేంద్ర నటుడు కిచ్చా సుదీప్ కలయికలో మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న చిత్రం కబ్జా. ఈ చిత్రం ట్రైలర్ ని నిన్నటి రోజున సాయంత్రం విడుదల చేయడం జరిగింది. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా మార్చి 17వ తేదీన ఈ చిత్రం విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగు , హిందీ,  తమిళ్,  కన్నడ , మలయాళం వంటి భాషలలో విడుదల చేస్తున్నారు. కబ్జా టీజర్ ఇప్పటికే బాగా స్పందన లభించింది ముఖ్యంగా తల్లి సెంటిమెంటుతో సహా భారీ యాక్షన్ సన్నివేశాలు అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్గా టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.

తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత డీటెయిల్ ని ఇవ్వడం జరిగింది.. ఈ సినిమా 1940లో ప్రారంభంలో మాఫియా ఆగడాలు ఎదుగుదల గురించి రివీల్ చేయడం జరిగింది డైరెక్టర్ చంద్రు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కల్పిత కథతో కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. ఉపేంద్ర 1940 చివరిలో భారతదేశాన్ని పరిపాలించిన అండర్ వరల్డ్ డాన్ గా కల్పిత పాత్రలు మునిపెన్నడూ లేని విధంగా కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే సర్ప్రైజ్ గా సుదీప్ కూడా ఈ చిత్రంలో మునిపెన్నడూ లేని పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా శ్రీయ శరణ్ నటిస్తున్నది. తాన్య హోప్ కీలకమైన పాత్రలో  నటిస్తోంది. కేజిఎఫ్ తరహాలో పెప్పీ డాన్స్ నంబర్ గా కూడా ఉంది. సహాయక తారగనంలో జగపతిబాబు , రాహుల్ దేవ్  తదితరులు నటిస్తూ ఉన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అత్యంత డార్క్ మోడ్ లో  పూర్తిగా కేజిఎఫ్ ఫార్మాట్ లోని అనుసరించినట్లుగా తెలుస్తోంది.  కేజీఎఫ్ కి సంగీతం అందించిన రవి ఈ చిత్రానికి అందించడం జరిగింది.  ట్రైలర్ కే జి ఎఫ్ పోలికలు అధికమయ్యాయి.  ఉపేంద్ర గ్రేడ్ పాత్ర హైలెట్ కాగా సుదీర్ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇక తమిళంలో విడుదలైన ఈ ట్రైలర్ కే జి ఎఫ్ అంతగా ఆసక్తిని సృష్టించలేకపోతోంది. ఇక ఈ సినిమాకు విడుదల సమయం కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది కానీ ఎక్కడా కూడా పెద్దగా హైప్ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: