గత శుక్రు వారం విడుదలైన ‘బలగం’ మూవీకి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ ఆ సినిమాకు కలక్షన్స్ అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో దిల్ రాజ్ తీసిన మూవీ కాబట్టి ఈ మూవీ కలక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ దిల్ రాజ్ కు ఉన్న పరిచయాలు రీత్యా ఈ మూవీకి ఓటీటీ ఛానల్స్ రైట్స్ వల్ల వచ్చే మొత్తాలతో దిల్ రాజ్ ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా లాభపడతాడు. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ మూవీ కథ చాలసహజంగా ఉన్నప్పటికీ టేకింగ్ చాల స్లోగా ఉండటంతో సగటు ప్రేక్షకుడు అంతగా ఈ మూవీకి కనెక్ట్ కాలేకపోయాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.




దీనికితోడు ఈ మూవీ కథ అంతా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆచార వ్యవహారాలతో లింక్ చేయబడి ఉండటంతో కోస్తా జిల్లాల ప్రాంతాల వారికి ఆచారాలు కొంతవరకు కొత్తగా అనిపిస్తాయి. అయితే అనూహ్యంగా ఈసినిమా పై కాపీ మరకలు అంటడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈసినిమా తాను గతంలో వ్రాసిన ఒక కథను ఆధారంగా తీసిన మూవీ అంటూ రచయిత మరియు జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.



ఒక సినిమా హిట్ అయ్యాకా లేదా ఆసినిమాకు మంచి ప్రశంసలు లభించిన తరువాత ఆమూవీ కథ తమ కథ నుండి కాపీ కొట్టారు అంటూ అనేక సందర్భాలలో వార్తలు రావడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇప్పుడు ఈ ఆరోపణల పై దిల్ రాజ్ అదేవిధంగా దర్శకుడు వేణు ఎలా స్పందిస్తారు అన్నవిషయం తెలియవలసి ఉంది.




ఇదే విషయం పై ఈ కాపీ ఆరోపణలు చేస్తున్న గడ్డం సతీష్ స్పందిస్తూ తనను అడిగి ఈసినిమా తీసిన తన బాధ ఉండేది కాదు అంటూ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2011లో తాను వ్రాసిన ‘పచ్చికి’ కథను ఆధారంగా తీసుకుని ‘బలగం’ సినిమా తీసారని ఈ రచయిత ఆరోపణ..





మరింత సమాచారం తెలుసుకోండి: