యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుండో ఎన్టీఆర్ 30 వ మూవీ అప్డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసింది. అలా గ్లోబల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అలాగే మధ్యలో కొంత కాలం పాటు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా మూవీ యూనిట్ బయటకు విడుదల చేయలేదు. దానితో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో కాస్త నిరుత్సాహంలో పడిపోయారు. ఏది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను మార్చి నెల నుండి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు.

దీనితో ఈ సినిమాపై మళ్ళీ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఎన్టీఆర్ 30 మూవీ యూనిటీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ఈ రోజు ప్రకటిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ ను ఈ మూవీ యూనిట్ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: