బాలీవుడ్ హాట్ నటిగా దూసుకుపోతున్న జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విపరీతమైన హాట్ నెస్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు.జాన్వి మహారాష్ట్రలోని ముంబైలో 6 మార్చి 1997న ఇండియా లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి ఇంకా బాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కి జన్మించింది. ఇక ఈరోజు తన 26వ పుట్టినరోజు జాన్వి జరుపుకుంటోంది.చాలా చిన్న వయసులోనే జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. జాన్వీ కపూర్ చాలా అందంగా హాట్ గా ఉంటుంది. తనకి యాక్టింగ్ రాకపోయినా కానీ తన అందంతో యూత్ లో భారీగా క్రేజ్ సంపాదించుకొని బీ టౌన్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది.ఇక సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, కేవలం 21 సంవత్సరాల వయస్సులో, జాన్వి కపూర్ నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ధడక్ (జాన్వీ కపూర్ తొలి చిత్రం ధడక్)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ హాట్ నటి, ఆ తర్వాత చాలా ఉత్తమ చిత్రాలలో కూడా నటించింది.అయితే ఆమెకు చాలా ప్లాప్స్ వచ్చాయి.


జాన్వి కపూర్ తరచుగా సోషల్ మీడియాలో విశేషమైన లేదా బంధుప్రీతి వంటి విషయాలతో నెటిజన్స్ చేత చాలా ఎక్కువగా ట్రోల్ చేయబడుతోంది.ప్రస్తుతానికి, జాన్వీ కపూర్ చేయబోయే సినిమా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకుంటే ఈమె  దోస్తానా 2, బావల్ ఇంకా మిస్టర్&మిసెస్ మహి వంటి సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 30 వ సినిమాలో కూడా జాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది జాన్వికి తెలుగులో ఫస్ట్ సినిమా కావడం విశేషం. మరి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని తన తల్లి లాగే మెప్పిస్తుందో లేదో చూడాలి.. ఇప్పటిదాకా సరైన హిట్టు లేకున్నా అభిమానులని సంపాదించుకుందంటే కేవలం తన అందం వల్లే అని చెప్పవచ్చు. జాన్వి తన అందానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఫిట్నెస్ కోసం జిమ్, యోగ వంటి వాటిని తన అలవాట్లుగా మార్చుకుంది.ఇవే తన హాట్ నెస్ కి ప్రధాన కారణం.అందుకే ఆమె బాలీవుడ్ లో అంత ఫేమస్. తాను ఒక్క ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిందంటే షేక్ అవ్వడం ఖాయం.అందుకే ఆమెకు బాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: