టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ హీరోనో మనందరికీ తెలుసు అయితే అప్పట్లో చిరంజీవి చేసిన మూవీస్ లలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే నాగబాబు ఒకానొక టైం తరువాత తాను కూడా హీరో గా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసి చిరంజీవి తనని హీరోగా చేసి కొన్ని సినిమాలు తీయించారు.

కానీ ఆయన హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ఆయన కెరియర్ హీరోగా సక్సెస్ కాలేకపోయింది దింతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు నాగబాబు అయితే ఆయన హీరోగా సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే మెగాస్టార్ తమ్ముడు అనే ఒక భారీ ఇమేజ్ ఉండడం వల్లనే. అందువల్లే ఆయన ఆ అంచనాల మధ్య నిలబడ లేక పోయారని చెప్పాలి.

ఐతే ఇక యాక్టర్ గా ఆయనికి పెద్దగా స్కోప్ లేదు అని తెలుసుకున్న ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మారి గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి సినిమాలు తీసి దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఇక మల్లె మాల వాళ్ళు నిర్వహించే జబర్దస్తు షో కి జడ్జ్ గా వెళ్లి ఆ షో సక్సెస్ లో కీలక పాత్ర వహించారని చెప్పాలి ఐతే అక్కడ కూడా జరిగిన కొన్ని గొడవల కారణం గా ఆయన అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేసి ప్రస్తుతం ఖాళీ గా ఉంటున్నాడు.ప్రెసెంట్ వాళ్ళ తమ్ముడు ఐన పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ ఐనా జనసేన లో మెంబర్ గా ఉంటూ ఆపార్టీ రాజకీయాల్లో కీలక వ్యక్తి గా మారారు.ఇక నాగ బాబు కొడుకు అయినా వరుణ్ తేజ్ గూర్చి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే తాను ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీ లో మంచి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నాగబాబు సినిమాల్లో హీరోగా సక్సెస్ కాకపోయినా వాళ్ళ అబ్బాయి అయిన వరుణ్ హీరోగా మంచి సినిమాలు చేస్తూ నాగబాబుకి దక్కని ఆ హీరో అనే టాగ్ ని తగిలించుకొని సక్సెస్ ఫుల్ గా మోస్తున్నాడు.

 ఆ విధంగా నాగబాబు గారు ఇండస్ట్రీ లో హీరో సక్సెస్ సాధించలేకపోవడానికి కారణం ఆయన మెగాస్టార్ చిరు గారికి తమ్ముడు అవ్వడమే అని కొన్ని ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: