టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో మొదట తమిళంnలో రూపొందిన బాయ్స్ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బాయ్స్ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో ఈ హీరోకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

దానితో తెలుగు లో సిద్ధార్థ్ కు అనేక సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఈ హీరో తెలుగు.లో అనేక మూవీ లలో నటించాడు. అలాగే ఈ హీరో నటించిన మూవీ లలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ... బొమ్మరిల్లు ... ఆట సినిమాలు మంచి విజాయలను అందుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ హీరో కు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సిద్ధార్థ్ ... అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందినటు వంటి మహా సముద్రం అనే తెలుగు మూవీ  లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో శర్వానంద్ కూడా హీరో గా నటించిగా ... ఈ మూవీ లో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది.

మూవీ లో హీరోయిన్ గా నటించిన అదితీ రావ్ హైదరి తో సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరు కూడా కలిసి కొన్ని ప్రదేశాలలో కనిపించడంతో ఈ వార్తలు బలపడ్డాయి. తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ అదితి స్పందించింది. తనపై వస్తున్న రూమర్ లను ఇండస్ట్రీలో పని చేయడం ప్రారంభించినప్పటి నుండే పట్టించుకోవడం మానేశాను అని తెలిపింది. రూమర్స్ మాట్లాడుకుంటున్న జనాల్ని మనం ఆపలేము. వాళ్లు ప్రతి రోజు ఏదో ఆసక్తికరమైన వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఏది ఇష్టమో అది చేసుకొని వెళతాను. నా వరకు నేను ఓకే అని ఈ ముద్దుగుమ్మ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: