తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ ఎక్కువ శాతం మెగా హీరోలకు సంబంధించిన మూవీ లకు దర్శకత్వం వహించాడు.

మొదట హరీష్ శంకర్ మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. చాలా సంవత్సరాల పాటు అపజయాలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ కు ఈ మూవీ ద్వారా భారీ బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. అలాగే హరీష్ శంకర్ కూడా ఈ మూవీ ద్వారా ఫుల్ క్రేజ్ లభించింది. ఆ తరువాత ఈ దర్శకుడు మరో మెగా హీరో అయినటు వంటి సాయి దరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.

ఆ తర్వాత ఈ దర్శకుడు మరో మెగా హీరో అయినటు వంటి వరుణ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి గద్దల కొండ గణేష్ అనే మరో మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలతో మూడు సినిమాలను తెరకెక్కించే ... మూడింటితో మంచి విజయాలను అందుకున్న ఈ దర్శకుడు మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు. మరి ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలతో మూడు విజయాలను అందుకున్న ఈ దర్శకుడు నాలుగో మూవీ తో కూడా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: