తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వేత్తి అనే పేరుతో విడుదల అయింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. ఇప్పటివరకు ఈ సినిమా 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ 18 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 18 రోజుల్లో తమిళ నాడుnలో ఈ మూవీ కి 36.45 కోట్ల కలెక్షన్ లు లభించాయి.

18 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 35.77 కోట్ల కలెక్షన్ లు లభించాయి.
కర్ణాటక లో 7.75 కోట్లు , కేరళ లో 1.11 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.13 కోట్లు ,  ఓవర్సీస్ లో 23.40 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 18 రోజుల్లో 54.91 కోట్ల షేర్ ... 105.61 గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ఇప్పటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: