గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దేవదాస్ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో ఇలియానా తన అదిరిపోయే అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. అలాగే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలియానా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు లో సినిమాల్లో నటించడం తగ్గించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో ఇలియానా ఎక్కువగా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో అంద చందాలను అరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇలియానా కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలియానా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని చాలా క్లాస్ గా ... డీసెంట్ గ ఫోటోలకు ఇలియానా స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: