చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా కాజల్ చాలా సంవత్సరాల పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. అలాహిందీ మూవీ లలో కూడా కాజల్ నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. 

మూవీ లో కమల్ హాసన్ హీరో గా నటిస్తూ ఉండగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో అందాల ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు కొంత కాలం క్రితమే పెళ్లి అయిన విషయం మనకు తెలిసిందే. అలాగే కాజల్ కొంత కాలం క్రితమే ఒక పండంటి బిడ్డకు కూడా ఇప్పటికే జన్మనిచ్చింది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్ బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలలకే మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకే ఎందుకు నటిస్తున్నావు అంటూ అందరూ తనను అడుగుతున్నారు అని కాజల్ అగర్వాల్ తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించిన సమాధానాన్ని కూడా కాజల్ తాజాగా ఇచ్చింది. నటన పై ఉన్న ఇష్టం తోనే తొందరగా మూవీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాను అని కాజల్ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే కాజల్ తాజాగా ఘోస్టి అనే చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ నెల 17 వ తేదీన విడుదల కాబోతోంది. మరి ఈ మూవీ తో కాజల్ అగర్వాల్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: