మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ పోయిన సంవత్సరం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఈ మూవీ బృందం  టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతోంది. ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ ,  శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో శ్రీకాంత్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు ... శ్రీకాంత్ పాత్ర నిడివి కూడా చాలా ఎక్కువగా ఉండనున్నట్లు ... శ్రీకాంత్ వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: