టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పేరును ప్రపంచ స్థాయి కి తీసుకెళ్లినా దర్శక ధీరుడు రాజమౌళి గారు. ఆయనతో  సినిమాలు చేసేందుకు ప్రెసెంట్ బాలీవుడ్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ ఇప్పుడు ఆ రేంజ్ లో ఉంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ హాలీవుడ్ ను తాకుతోంది.

ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హెచ్ సీఏ అవార్డులు కూడా సొంతం చేసుకుంది త్రిబుల్ ఆర్ మూవీ.

ఇక ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లు కలిసి హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో రాజమౌళి ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు మొదటి సినిమా ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్ తో వచ్చింది. అయితే ఆయన కాస్త లావుగా ఉండటం చూసి.. వీడు దొరికాడేంట్రా బాబు అని నా మనసులో ఫీల్ అయ్యా. సరేలే వచ్చిందే ఛాన్స్ అని షూటింగ్ స్టార్ట్ చేశా. అప్పుడు తెలిసింది జూనియర్ ఎన్టీఆర్ ఏంటో.

ఆయన నటన, డ్యాన్స్ లు నా మతి పోగొట్టేశాయి. అప్పటి వరకు నా మనసులో నేను అనుకుంది తప్పు అని నాకు అర్థం అయింది. ఇంత గొప్ప హీరో నా మొదటి సినిమాకు దొరకడం నా అదృష్టం అని అనుకున్నా. అందుకే అందరికంటే ఎక్కువ సినిమాలు తారక్ తోనే చేశాను అంటూ గతంలో జక్కన్న చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఏదేమైనా రాజమౌళి గారు మిగతా హీరోలతో ఒక రకంగా ఉంటే ఎన్టీఆర్ తో మాత్రం డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ రిలేషన్ చెబుతుంది వారి మధ్య ఉన్నా బాండింగ్ గురించి అని సోషల్ మీడియా వేదికగా ఇద్దరి అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: