కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో రజనీకాంత్ కూడా ఒకరు. మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు పడ్డ రజనీకాంత్.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. రజనీకాంత్ అభిమానులు విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మొదట బస్సు కండక్టర్గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు బ్లాక్ బస్టర్ విజయాలలో నటించారు.


ఇక రజనీకాంత్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తాజాగా.. పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమైన సమయంలో కరోనా వచ్చింది. రాజకీయాలలో రావాలని ప్లాన్ ఉన్నప్పుడు డాక్టర్లు కీలకమైన సూచనలు తెలియజేశార అంట. ప్రజలను కలిసే సమయంలో పది అడుగుల దూరంగా ఉండాలి మాస్క్ వేసుకొని ఉండాలని రజనీకాంత్ కి తెలియజేశారట. దీంతో ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్ ఎంట్రీ పై ఆలోచించి అడుగులు వేయాలనుకున్నారట రజనీకాంత్.

అలాంటి సమయంలోనే కిడ్నీ సమస్య కూడా ఉండడం దానికి తోడు కరోనా వైరస్ తీవ్రమైన స్థితిలో ఉన్న సమయంలో రాజకీయాలలోకి వెళ్లి జనాలలోకి వెళ్లడం మంచిది కాదని వివరించారు రాజకీయాలలో రజనీకాంత్ రావడానికి భయపడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ రాజు నీకాంత్ రాజకీయాలలోకి రాకపోవడానికి అసలు నిజం తన ఆరోగ్యం సహకరించకపోవడమే అన్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమాతో నైనా కచ్చితంగా విజయాన్ని అందుకోవాలని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ నటించిన గత చిత్రాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ గా మిగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో టాప్ లోనే ఉన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: