ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో పెట్టడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు దర్శకనిర్మాతలు. కానీ ఇటీవల కాలంలో మాత్రం తెలంగాణ యాసతో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ సాదిస్తూ ఉన్నాయి. దీంతో దర్శక నిర్మాతల సైతం తెలంగాణ యాస ప్రాసకు బ్రహ్మరథం పడుతూ పట్టం కడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక స్టార్ హీరోలు సైతం తెలంగాణ యాసలో మాట్లాడుతూ డైలాగులు చెప్పడానికి తెగ ఇష్టపడిపోతున్నారు. ఇక ఇలా ఇటీవల కాలంలో తెలంగాణ యాసతో వచ్చి మంచి విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 జాతి రత్నాలు : నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్రోల్స్ లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంగారెడ్డి లోని జోగిపేట్ నేపథ్యంలో దొరికేక్కింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులందరికీ కడుపుబ్బా నవ్వించి రికార్డు కలెక్షన్స్ సాధించింది.

 వకీల్ సాబ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా లో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాస్ లో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక స్టార్ హీరో తెలంగాణ యాసలో మాట్లాడి హిట్టు కొట్టిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 లవ్ స్టోరీ : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమా నిజాంబాద్ ఆర్మూర్ ప్రాంతాన్ని ఎంచుకొని తీశారు అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఒకప్పుడు ఉన్న కుల వివక్షతను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

 డీజే టిల్లు : తెలంగాణ పోరగాళ్ల లైఫ్ స్టైల్ ని చూపిస్తూ డిజె టిల్లు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు జొన్నలగడ్డ సెన్సేషన్ విజయాన్ని సాధించాడు అని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది.

 త్రిబుల్ ఆర్ : ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటించిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆభిమానులు అందరిని ఫిదా చేసేశాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 వాల్తేరు వీరయ్య : వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ రవితేజ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు తెప్పించాడు.

 బలగం : కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన  బలగం సినిమా తెలంగాణ సాంప్రదాయాలను గుర్తు చేయడమే కాదు పల్లెటూరి వాతావరనాన్ని సహజమైన పాత్రతో అందరూ మనసులను కదిలించి హిట్టు కొట్టింది.


 ఇవి మాత్రమే కాకుండా నాని హీరోగా నటిస్తున్న దసరా.. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న దాస్కా దమ్ కి.. బాలయ్య హీరోగా నటిస్తున్న ఎన్బికె 108 సినిమాలు కూడా తెలంగాణ యాసులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: