కేవలం ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధించింది బలగం మూవీ. టాలీవుడ్ కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది.మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా సక్సెస్‌ ఫుల్‌గా నడుస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ గా మౌత్ టాక్‌ పెరగడంతో మల్టీ ప్లెక్సుల్లో కూడా ఈ సినిమాకు క్రమంగా షోస్‌ పెరుగుతున్నాయి. టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే బలగం సినిమా కలెక్షన్లు కూడా బాగా భారీగా పెరుగుతున్నాయి. మార్చి 3వ తేదీన విడుదలైన ఈ సినిమా శనివారం నాటికి సుమారు రూ. 9 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఆదివారం కావడంతో ఈ సినిమాకి కలెక్షన్లు మరింత పెరిగాయి.


సోమవారం కూడా మరింత పెరిగే అవకాశం వుంది.. ఈ రోజు కలెక్షన్స్ కూడా యాడ్ అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల దాకా బెంచ్ మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తుంది. దిల్‌ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా బలగం సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ నైజాం ఏరియాలో రూ. 6 కోట్లు పైగా, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 4 కోట్లు పైగా వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 10 కోట్లు పైగా గ్రాస్‌తో పాటు రూ. 5 కోట్లు పైగా షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది. ఈరోజు రేపు లోగా ఖచ్చితంగా ఈ సినిమా 15 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవడం ఖాయం. పైగా ఇప్పట్లో మరే పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని కోట్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: