మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతోంది. కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్మూవీ కోసం అదిరిపోయే సాంగ్స్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ ను ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించలేదు. దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్  ఈ సినిమాను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ... ఈ మూవీ టైటిల్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... అందుకు తగినట్టుగా ఈ మూవీ బృందం కూడా పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: