టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో నాగ శౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చ్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బంధం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హీరోయిన్ పాత్రలో నటించిన మాళవిక నాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాళవిక నాయర్ మాట్లాడుతూ ... ఇప్పటి దాకా నటిగా ఏం చేయాలో అంత వరకే చేశానని ... కానీ ఇది తనకు దగ్గరైన మూవీ అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు వరకు ఒక జంట ప్రేమ ప్రయాణం ఈ మూవీ లో చూపిస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రేమ , ద్వేషం , హాస్యం ఇలా అన్ని బావోద్వేగాలు ఈ మూవీ లో ఉంటాయి అని మాళవిక వివరించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుసగుసలాడే ... జ్యొ అచ్యుతానంద మూవీ లు  మంచి విజయాలు అందుకోవడంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: