గోల్ మాల్ 3 అయితే ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.ఆ తరువాత కామెడీ జోనర్ నుంచి బయటకి వచ్చి రోహిత్ శెట్టి తన యాక్షన్ థ్రిల్లర్ సింగం (2011) తో యాక్షన్ జానర్లో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన వాటిలో ఒకటిగా నిలిచింది. తరువాత ముఖ్యమైన విజయాలలో బోల్ బచ్చన్ (2012), షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ (2013) ఉన్నాయి. చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఆ సమయంలో ఆమిర్ ఖాన్ 3 ఇడియట్స్ని అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.తరువాత సింగం రిటర్న్స్ (2014), సింబా (2018), సూర్యవంశీ (2021) వంటి విజయవంతమైన చిత్రాలతో కాప్ యూనివర్స్ ఫ్రాంచైజీలో హిట్లు కొట్టాడు. ఇలా ఎక్కువ సినిమాలు తీసి రికార్డ్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ దర్శకులలో ఒకడిగా రోహిత్ శెట్టి నిలిచాడు.